SL vs AFG | ఈ ఏడాది వన్డేల్లో శ్రీలంక తొలి విజయం.. అఫ్గనిస్థాన్‌తో సిరీస్ సమం
SL vs AFG : వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ రేసులో ఉన్న శ్రీలంక(Srilanka) ఎట్టకేలకు గెలిచింది. ఈ ఏడాది వన్డేల్లో ఆ జట్టు తొలి విజయం చవి చూసింది. అఫ్గనిస్థాన్‌పై రెండో వన్డేలో గెలిచి వరుస పరాజయాలకు ముగింపు పలికింది. సిరీస్‌లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ధనంజయ డిసిల్వా...
SL vs AFG : వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ రేసులో ఉన్న శ్రీలంక(Srilanka) ఎట్టకేలకు గెలిచింది. ఈ ఏడాది వన్డేల్లో ఆ జట్టు తొలి విజయం చవి చూసింది. అఫ్గనిస్థాన్‌పై రెండో వన్డేలో గెలిచి వరుస పరాజయాలకు ముగింపు పలికింది. సిరీస్‌లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ధనంజయ డిసిల్వా(29 నాటౌట్, 3 వికెట్లు) రాణించాడు. కుశాల్ మెండిస్(78), కరుణరత్నే(52) అర్ధ శతకాలతో చెలరేగారు. దాంతో, 6 వికెట్ల నష్టానికి శ్రీలంక 323 పరుగులు కొట్టింది.
ఆతర్వాత పర్యాటక అఫ్గనిస్థాన్‌ను 191కే కట్టడి చేసింది. దాంతో, 132 పరుగుల తేడాతో భారీ విక్టరీ సాధించింది. వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. సిరీస్ ఫలితాన్నినిర్ణయించే మూడో వన్డే జూన్ 7న జరగనుంది.
క్వాలిఫై అయ్యేనా?
ఒకప్పటి వరల్డ్ చాంపియన్ శ్రీలంక ఈ ఏడాది వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్‌లో మాత్రం వెనకబడింది. ఆఖరి స్థానం కోసం పసికూనలైన ఐర్లాండ్, నమీబియా, అఫ్గనిస్థాన్, నేపాల్, అమెరికా వంటి జట్లతో పోటీపడుతోంది. న్యూజిలాండ్ పర్యటనలో దారుణ ఓటమి లంక క్వాలిఫైయింగ్ అవకాశాల్ని దెబ్బతీసింది. అయినా కూడా ఆ జట్టుకు ఇంకా అవకాశం ఉంది. అయితే.. జింబాబ్వేలో జూన్ 18 నుంచి జరగనున్న వరల్డ్ కప్ క్వాలిఫైయర్ పోరులో విజేతగా నిలవాలి. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన రెండు జట్లు వరల్డ్ కప్ పోటీకి క్వాలిఫై అవుతాయి. అక్టోబర్, నవంబర్ మధ్య భారత్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. 2011 మాదిరిగా సొంత గడ్డపై మళ్లీ కప్పు కొట్టాలని టీమిండాయా భావిస్తోంది.
ఇవి కూడా చదవండి
Shane Warne | షేన్ వార్న్ ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’కి నేటితో 30 ఏళ్లు
David Warner | డబ్ల్యూటీసీ ఫైనల్లో ఒక్కటి కాదు.. మూడు మ్యాచ్‌లు ఆడించాలి : వార్నర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

