Shane Warne | షేన్ వార్న్ ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’కి నేటితో 30 ఏళ్లు
Shane Warne : మిస్టరీ బౌలర్‌గా క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన షేన్ వార్న్(Shane Warne) చనిపోయి ఏడాది అవుతోంది. కానీ, అతడు తన సంచలన బౌలింగ్ ప్రదర్శనతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అయితే.. ఒకే ఒక బంతి అతడికి ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. 1993లో యాషెస్ సిరీస్(Ashes Series)లో వార్న్ వేసిన నమ్మశక్యం కాని బంతి చరిత్ర పుటల్లో...
Shane Warne : మిస్టరీ బౌలర్‌గా క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన షేన్ వార్న్(Shane Warne) చనిపోయి ఏడాది అవుతోంది. కానీ, అతడు తన సంచలన బౌలింగ్ ప్రదర్శనతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అయితే.. ఒకే ఒక బంతి అతడికి ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. 1993లో యాషెస్ సిరీస్(Ashes Series)లో వార్న్ వేసిన నమ్మశక్యం కాని బంతి చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ‘బాల్ ఆఫ్ ది సెంచరీ'(Ball Of The Century) – ‘శతాబ్దపు బంతి’గా రికార్డుల్లోకి ఎక్కింది. ఆ అద్భుత ఘట్టానికి నేటితో 30 ఏళ్లు.
అవును.. సరిగ్గా ఇదే రోజు.. ఈ లెగ్ స్పిన్నర్ ఆ మ్యాజిక్ బంతి వేశాడు. ఓల్డ్ ట్రఫోర్డ్ స్టేడియంలో జరిగిన యాషెస్ సిరీస్‌లో తన ఓవర్ తొలి బంతికి వార్న్ మైక్ గాటింగ్(Mike Gatting)ను బౌల్డ్ చేశాడు. వాట్ ఏ మిరాకిల్ అంటూ ఆసీస్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. ఫ్లైట్ చేస్తూ విసిరిన ఆ బాల్ దిశ మార్చుకుని ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దాంతో, గాటింగ్ బిత్తరపోయాడు. అసలు తాను ఎలా ఔటయ్యాడో, ఏం జరిగిందో ఆ ఇంగ్లండ్ బ్యాటర్‌కు అర్థం కాలేదు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుండెపోటుతో కప్పకూలి..
అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన తర్వాత వార్న్ కామెంటేటర్‌గా అవతారమెత్తాడు. థాయ్‌లాండ్‌లోని ఒక రిసార్ట్‌లో బస చేసిన అతను గుండెపోటు(Heart Aattack)తో మరణించాడు. అచేతనంగా పడి ఉన్న వార్న్‌కు సహచరుడు సీపీఆర్ చేసినా కూడా ఫలితం లేకపోయింది. వార్న్ మరణవార్త విని క్రికెట్ ప్రపంచం షాక్ అయింది. ఆస్ట్రేలియా క్రికెట్‌కు వార్న్ అందించిన సేవలు చిరస్మరణీయం. అందుకు గుర్తింపుగా మెల్బోర్న్ మైదానం వెలుపలా అతడి నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేశారు.
కెప్టెన్‌గా తొలి ట్రోఫీ
ఐపీఎల్ ఆరంభ సీజన్లో వార్న్ సత్తా చాటాడు. కెప్టెన్‌గా ఆడిన తొలి సీజన్లోనే రాజస్థాన్ రాయల్స్‌కు కప్పు అందించాడు. 2008 ఫైనల్లో వార్న్ సేన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. కెరీర్లో 145 టెస్టులు ఆడిన వార్న్ 708 వికెట్లు తీశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) వార్న్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఐపీఎల్ ట్రోఫీతో షేన్ వార్న్(2008)

ఇవి కూడా చదవండి
David Warner | డబ్ల్యూటీసీ ఫైనల్లో ఒక్కటి కాదు.. మూడు మ్యాచ్‌లు ఆడించాలి : వార్నర్
Rinku Singh | మాల్దీవ్స్‌లో రింకూ సింగ్.. సిక్స్‌ప్యాక్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

