Rinku Singh : ఐపీఎల్ పదహారో సీజన్లో రింకూ సింగ్(Rinku Singh) పేరే మార్మోగిపోయిన విషయం తెలిసిందే. ఈ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) స్టార్ విధ్వంసక బ్యాటింగ్‌తో మాజీ ఆటగాళ్లు, ఫ్యాన్స్ ఫిదా చేశాడు. సిక్సర్లతో చెలరేగిన ఈ చిచ్చరపిడుగు ఫినిషర్‌గా తన ముద్ర వేశాడు. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను అలరించిన రింకూ ఇప్పుడు వెకేషన్లో ఉన్నాడు. మాల్దీవ్స్‌లో సేదతీరుతున్నాడు.
ఒంటిపై చొక్కా లేకుండా దిగిన ఫొటోలను రింకూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘జాగ్రత్త.. అడిక్ట్ చేసే కంటెంట్ ముందుంది’ అని క్యాప్షన్ రాశాడు. సిక్స్ ప్యాక్ లుక్‌తో ఉన్న అతడిని చూసి ఫ్యాన్స్ ‘వారెవ్వా.. రింకూ’ అని కామెంట్లు చేస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్‌పై ఆఖరి ఓవర్లో దంచికొట్టిన రింకూ సింగ్ ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. యశ్ దయాల్ వేసిన 20వ ఓవర్లో 25 పరుగులు అవసరమయ్యాయి. అయితే.. కోల్‌కతా ఓటమి ఖాయం అనుకున్న దశలో రింకూ మ్యాజిక్ చేశాడు. వరుసగా 5 బంతులకు 5 సిక్స్‌లు బాదాడు. దాంతో, కోల్‌కతా సంచలన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌తో రింకూ సిక్సర్ల తుఫాన్ మొదలైంది. బౌలర్ ఎంతటి ఘటికుడు అయినా రింకూ ముందు తేలిపోయారు. అయితే.. కీలక మ్యాచుల్లో మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్ చేరలేదు. కానీ, రింకూ మాత్రం మ్యాచ్ విన్నర్‌గా కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. 14 మ్యాచుల్లో ఈ లెఫ్ట్ హ్యాండర్ 59.25 సగటుతో 474 పరుగులు సాధించాడు.