Ruturaj Gaikwad | ఘనంగా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ పెండ్లి.. ఫొటోలు
రుతురాజ్ పెండ్లి ఫొటోలు చూసిన సెలబ్రెటీలు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
2/9
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓపెనర్, టీమ్‌ఇండియా (TeamIndai) క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఓ ఇంటివాడయ్యాడు.
3/9
శనివారం తన ప్రేయసి ఉత్కర్ష పవార్‌ను (Utkarsha Pawar) ముంబైలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వివాహమాడాడు.
4/9
గైక్వాడ్ ప్రేయసి ఉత్కర్ష కూడా క్రికెటరే. ఆమె దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర మహిళల జట్టు తరఫున ఆల్‌రౌండర్‌గా ప్రాతినిధ్యం వహించింది.
5/9
ఉత్కర్ష పవార్ 1998 అక్టోబర్ 13న మహారాష్ట్రలోని పుణెలో జన్మించింది. మహారాష్ట్ర తరఫున దేశవాలీ క్రికెట్ ఆడింది. 10 మ్యాచ్‌లు ఆడిన ఉత్కర్ష.. 5 వికెట్లు పడకొట్టింది.
6/9
ప్రస్తుతం పుణెలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ అండ్ ఫిట్‌నెస్ సైన్సెస్‌లో విద్యను అభ్యసిస్తోంది.
7/9
రుతురాజ్ గైక్వాడ్, ఉత్కర్ష ఇద్దరూ గత రెండేండ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తున్నది.
8/9
రెండేండ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
9/9
పెండ్లి ఫొటోలను తాజాగా రుతురాజ్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవి వైరల్‌గా మారాయి.
10/9
ఈ స్టార్ ఓపెనర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదోసారి ఐపీఎల్ (IPL) ట్రోఫిని సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర విషయం తెలిసిందే.