Srilanka Cricket | శ్రీలంక క్రికెట్లో ‘సూర్యోదయం’.. కోచ్‌గా ముద్ర వేస్తాడా..?
Srilanka Cricket : పొట్టి వరల్డ్ కప్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించిన శ్రీలంక (Srilanka) జట్టు రాత మారబోతోంది. లంకను గాడీలో పెట్టేందుకు కొత్త కోచ్ వస్తున్నాడు. అతడు ఎవరో కాదు ఆ దేశ వెటరన్ ఆటగాడు సనత్ జయసూర్య (Sanath Jayasuriya).
Srilanka Cricket : పొట్టి వరల్డ్ కప్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించిన శ్రీలంక (Srilanka) జట్టు రాత మారబోతోంది. నిరుడు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ నుంచి వైఫల్యాల బాటలో నడుస్తున్న లంకను గాడీలో పెట్టేందుకు కొత్త కోచ్ వస్తున్నాడు. అతడు ఎవరో కాదు ఆ దేశ వెటరన్ ఆటగాడు సనత్ జయసూర్య (Sanath Jayasuriya). అవును.. శ్రీలంక ప్రధాన కోచ్‌గా జయసూర్య నియామకం ఖాయమైందని సమాచారం. ఈ విషయాన్ని సోమవారం అతడే స్వయంగా వెల్లడించాడు.
‘హెడ్‌కోచ్‌గా ఉండాలని లంక బోర్డు నన్ను కోరింది. ఆ జాబ్ చేపట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని జయసూర్య తెలిపాడు. శ్రీలంక బోర్డు కూడా లెజెండరీ క్రికెటర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ధ్రువీకరించింది. ‘జయసూర్యను తాత్కాలికి హెడ్‌కోచ్‌గా నియమిస్తున్నామని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో లంక జట్టు ఇంగ్లండ్ పర్యటన (England Tour) వరకు అతడు కోచ్‌గా ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం గల జయసూర్య శ్రీలంకకు శాశ్వత పరిష్కారం దొరికేంత వరకూ పదవిలో కొనసాగుతాడు. అతడు జాతీయ జట్టును చక్కగా నడిపిస్తాడని నమ్ముతున్నాం’ అని బోర్డు వివరించింది. గతంలో జయసూర్య నేషనల్ సెలెక్టర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్నాడు.

పూర్వ వైభవం తేవాలని..
టీ20 వరల్డ్ కప్‌లో లంక లీగ్ దశలోనే ఇంటికి వెళ్లింది. దాంతో, ‘నేను ఈ జట్టుకు కోచ్‌గా ఉండలేనంటూ’ క్రిస్ సిల్వరహుడ్ (Chris Silverhood) తన పదవికి రాజీనామా చేశాడు. వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ.. ఆ మరుసటి ఏడాది పొట్టి ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలు ఉండడంతో లంక బోర్డు దేశీయ కోచ్ వైపే మొగ్గు చూపింది. వరల్డ్ కప్ హీరో అయిన జయసూర్యను సంప్రదించింది.

మసకబారుతున్న లంక క్రికెట్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు తాను సిద్ధమే అంటూ జయసూర్య ఒకే చెప్పేశాడు. ప్రపంచంలోని విధ్వంసక ఆటగాడిగా పేరొందని జయసూర్య 2007 టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత నాలుగేండ్లకు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇవి కూడా చదవండి
- Mouni Roy | చీరకట్టులో సెగలు పుట్టిస్తున్న మౌనీరాయ్
- TG Rains | రాష్ట్రంలో రెండురోజులు భారీ వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Pune Hit And Run | బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మృతి
- Shanmukha Movie | పవర్ఫుల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

