సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కేవ లం 23 నిమిషాల్లో రెండు వేలకు పైగా తైక్వాండో కిక్స్ కొట్టిన సాయి శ్రీహాస.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.
హైదరాబాద్ సైనిక్‌పురికి చెందిన 13 ఏళ్ల శ్రీహాసకు కోచ్ ఈశ్వర్ ఆదివారం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ అందించారు. మెరుపు వేగంతో 2005 కిక్స్ కొట్టిన శ్రీహాస పాత రికార్డు బద్దలు కొట్టింది.