హంబన్‌టొటా: తొలి వన్డే ఓటమి తర్వాత వరుస మ్యాచ్‌ల్లో విజృంభించిన శ్రీలంక సిరీస్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మూడో పోరులో ఆతిథ్య లంక 9 వికెట్లతో అఫ్గాన్‌ను చిత్తుచేసి 2-1తో సిరీస్ చేజిక్కించుకుంది.
తొలుత అఫ్గాన్ 22.2 ఓవర్లలో 116కు ఆలౌటైంది. నబి (23) టాప్ స్కోరర్ కాగా.. లంక బౌలర్లలో చమీర 4, హసరంగ 3 వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో లంక 16 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 120 పరుగులు చేసింది.