నెల్సన్ (న్యూజిలాండ్) : కివీస్ పర్యటనలో టీ20 సిరీస్ ఓడిపోయిన శ్రీలంకకు ఆఖరి మ్యాచ్‌లో ఊరట విజయం దక్కింది. గురువారం జరిగిన మూడో టీ20లో ఆ జట్టు 7 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కుశాల్ పెరీరా (46 బంతుల్లో 101, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు శతకానికి తోడు అసలంక (46) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఛేదనలో న్యూజిలాండ్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 211 పరుగుల వద్దే ఆగిపోయింది. రచిన్ రవీంద్ర (69), రాబిన్సనన్ (37), మిచెల్ (35) పోరాడినప్పటికీ కివీస్‌కు ఓటమి తప్పలేదు. చివరి మ్యాచ్‌లో ఓడినప్పటికీ సిరీస్‌ను న్యూజిలాండ్ 2-1తోగెలుచుకుంది.