హైదరాబాద్, అక్టోబర్11(నమస్తే తెలంగాణ): ప్రొ కబడ్డీ జూనియర్ లీగ్ సీజన్-5కు శ్రీచైతన్య విద్యార్థులు ఎంపికయ్యారు. శుక్రవారం జూబ్లిహిల్స్ ఓబుల్‌రెడ్డి స్కూల్లో నిర్వహించిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో శామీర్‌పేటకు చెందిన చైతన్య విద్యార్థులు ప్రతిభ చాటారు.
మొత్తం 40 టీమ్‌లు హోరాహోరీగా తలపడగా, మొత్తం 16 జట్లను ఎంపిక చేశారు. స్కూల్‌కు చెందిన కబడ్డీ ప్లేయర్లను ప్రిన్సిపల్ ముత్తయ్య, కోచ్ సాయికుమార్ ప్రత్యేకంగా అభినందించారు