SRH vs MI | ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో రోహిత్ సేన గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఆటగాళ్లు.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ (84), సూర్యకుమార్ యాదవ్ (82) హాఫ్ సెంచరీలతో రాణించారు. రోహిత్ శర్మ (18), హార్దిక్ పాండ్యా (10), పోలార్డ్ (13) ఆకట్టుకోలేకపోయారు. కానీ ఇషన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ ముంబై జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి.. హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.
.@mipaltan seal a 42-run win over #SRH! 👏 👏
— IndianPremierLeague (@IPL) October 8, 2021
A solid performance with the bat sets up a fine victory for the @ImRo45-led unit in Abu Dhabi. 👌 👌 #VIVOIPL #SRHvMI
Scorecard 👉 https://t.co/STgnXhy0Wd pic.twitter.com/Ted3wkiyQp
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లను.. ముంబై బౌలర్లను కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అడ్డుకున్నారు. దీంతో మనీశ్ పాండే (69) మాత్రమే కాస్త భారీ స్కోర్ చేయగలిగాడు. ఇక మిగిలిన ఆటగాళ్లు విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులకే పరిమితమయ్యారు. ఫలితంగా హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు.