Kavya Maran | ఐపీఎల్లో భాగంగా ఆదివారం సొంత మైదానంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్ మరోసారి విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇసాన్ కిషన్ వరకు బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డారు. ఈ సీజన్లో సన్ రైజర్స్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి. గతేడాది జట్టు అద్భుతంగా ఆడి ప్రశంసలు అందుకున్నది. ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా ఆడుతుండడం చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో టీమ్ ఓనర్ కావ్య మారన్‌కు సైతం అంతపట్టడం లేదు. కావ్యకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అభిషేక్ శర్మ వికెట్‌ని కోల్పోయిన సమయంలో చిరాకుపడడం కనిపించింది. టోర్నీకి ముందు అందరూ సన్‌రైజర్స్ జట్టును బలమైన జట్టుగా పేర్కొన్నారు. ఈ సీజన్లో కేవలం తొలి మ్యాచ్‌లో మాత్రం సన్‌రైజర్స్ ఆకట్టుకున్నది. ప్రస్తుతం బ్యాట్స్‌మెన్ ఎవరూ ఫామ్‌లో ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఆదివారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో హెడ్ (8), ఇషాన్ కిషన్ (17 పరుగులు), అభిషేక్ శర్మ (18), అనికేత్ వర్మ (18), కమిందు మెండిస్ (1) అవుట్ అయ్యాడు. కేవలం నితీశ్‌రెడ్డి మాత్రమే 31 పరుగులు చేయగలిగాడు. హెన్రిచ్ క్లాసెన్ (27), కెప్టెన్ పాట్ కమిన్స్ తొమ్మిది బంతుల్లో 22 పరుగులు చేశాడు.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) April 6, 2025
గుజరాత్‌తో మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నాలుగు ఫోర్లు కొట్టిన అభిషేక్ శర్మ.. మరో భారీ షాట్‌కు యత్నించి తెవాటియా చేతికి దొరికిపోయాడు. అభిషేక్ అవుట్ అవడంతో కావ్య మారన్ చిరాకు పడింది. బ్యాటర్లు చెత్త షాట్లు ఆడుతూ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టిన నేపథ్యంలో అసంతృప్తికి గురైంది. ఆ సమయంలో కావ్య మె హావభావాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిషేక్ అవుట్ అయిన తీరుపై కావ్య నిరాశ చెందింది. ఈ సమయంలో ఇలాంటి షాట్ అవసరమా? అన్నట్లుగా స్పందించింది. కావ్య హావభావాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సన్‌రైజర్స్ ఆటతీరుపై సైతం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌పై ఓటమి తర్వాత సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో 10వ స్థానానికి చేరింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడింది. ఒక విజయంతో జట్టు ఖాతాలో 2 పాయింట్లు ఉండగా.. రన్‌రేట్ -1.629గా ఉన్నది. టేబుల్లో ఢిల్లీ జట్టు ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది. గుజరాత్ రెండో స్థానంలో ఉన్నది.
Ruk jao bhai kya kar rahe ho
Normal cricket khel lo ab 🤣🤣Kavya maran’s reactions 🤌🏽🤣 pic.twitter.com/O39QTMNgPc
— ••TAUKIR•• (@iitaukir) April 6, 2025
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు బంతితో అద్భుతంగా రాణించారు. సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిశోర్‌కు రెండో రెండు వికెట్లు దక్కాయి. హైదరాబాద్ బ్యాటర్లలో నితీశ్‌రెడ్డి అత్యధికంగా 31 పరుగులు చేశాడు. కెప్టెన్ కమిన్స్ తొమ్మిది బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ 16.4 ఓవర్లలు 153 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (61 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (49), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ (35 నాటౌట్) పరుగులు చేశారు.
Kavya Maran angry expression after Travis and Abhishek gets out
Mat khelo 300 ke liye 😂#SRHvsGT #siraj #GTvSRH #kavyamaran #IPL2025 pic.twitter.com/JddNFP11ms— CrickStudd (@CrickStudd) April 6, 2025