GT vs SRH : పంతొమ్మిదో సీజన్లో టేబుల్ టాపర్ అయ్యేది ఎవరో మరికాసేపట్లో తేలిపోనుంది. టాప్ గేర్ ఆటతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య బిగ్ ఫైట్ విజేత అగ్రస్థానం దక్కించుకోనుంది. తమకు అచ్చొచ్చినఅహ్మదాబాద్ వేదికపై చెలరేగాలని శుభ్‌మన్ గిల్ సేన భావిస్తుండగా.. కమిన్స్ సేన వరసగా రెండో విజయంపై కన్నేసింది. టాస్ గెలిచిన కమిన్స్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ బృందం లావెండర్ జెర్సీతో ఆడుతోంది.
ఐపీఎల్ -19లో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్ కీలక పోరులో గుజరాత్‌తో తలపడుతోంది. ఆరంభంలో తబడినా.. అనూహ్యంగా పుంజుకున్న శుభ్‌మన్ గిల్ సేన వరసగా నాలుగో విజయంతో టాప్‌లోకి దూసుకొచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం సంచలన ఆటతో ప్రత్యర్థులకు చెక్ పెడుతూ వస్తోంది.
ఫామ్‌లో ఉన్న సుదర్శన్, కెప్టెన్ గిల్, సుందర్‌పై ఎక్కువగా ఆధారపడుతున్న గుజరాత్‌ను సన్‌రైజర్స్ స్వల్ప స్కోర్‌కే కట్టడి చేయాలని వ్యూహాలు పన్నుతోంది. రబడ, సిరాజ్.. హోల్డర్, రషీద్ ఖాన్ల నుంచి ఆరెంజ్ ఆర్మీ హిట్టర్లకు ముప్పు పొంచి ఉంది. ఇటీవల ఆరు మ్యాచుల్లో హైదరాబాద్‌పై గుజరాత్ 5-1తో ఆధిపత్యం చెలాయించింది.
🚨 Toss 🚨@SunRisers have won the toss and elected to bowl first against @gujarat_titans in Match 5️⃣6️⃣
Updates ▶️ https://t.co/o2tKKCeEaH#TATAIPL | #KhelBindaas | #GTvSRH pic.twitter.com/ZhAfnLdsMH
— IndianPremierLeague (@IPL) May 12, 2026
గుజరాత్ తుది జట్టు : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సుదర్శన్, బట్లర్(వికెట్ కీపర్), సుందర్, హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రబడ, సిరాజ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – ప్రసిధ్ కృష్ణ, సాయి కిశోర్, అనుజ్ రావత్, కుమార్ కుషాగ్ర, గ్లెన్ ఫిలిప్స్.
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), క్లాసెన్, సలిల్ అరోరా, నితీశ్ రెడ్డి, స్మరణ్ రవించంద్రన్, కమిన్స్(కెప్టెన్), శివాంగ్ కుమార్, మలింగ, షకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.
ఇంప్యాక్ట్ సబ్స్ – ట్రావిస్ హెడ్, లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, హర్ష్ దూబే.