IPL 2025 : ప్లే ఆఫ్స్ సమీకరణాలు మారుతున్న వేళ సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను ఢీ కొట్టనుంది. చెపాక్ వేదికగా జరుగుతున్న ఈమ్యాచ్‌లో టాస్ గెలిచిన కమిన్స్ ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
ఆరేసి మ్యాచుల్లో ఓడిన ఇరుజట్లకు ఇది చావోరేవో పోరు. దాంతో, విజయం కోసం హోరాహోరీగా తలపడడం ఖాయం. ఈ గేమ్ కోసం సీఎస్కే రెండు మార్పులు చేసింది. రచిన్ రవీంద్ర స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్ ఆడనుండగా.. విజయ్ శంకర్ బదులు దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చాడు.
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కాట్, జీషన్ అన్సారీ, షమీ.
ఇంప్యాక్ట్ సబ్స్ : ట్రావిస్ హెడ్, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, వియాన్ మల్డర్.
🚨 Toss 🚨@SunRisers won the toss and elected to bowl against @ChennaiIPL in Chennai.
Updates ▶️ https://t.co/26D3UalRQi#TATAIPL | #CSKvSRH pic.twitter.com/6F1msvgrGA
— IndianPremierLeague (@IPL) April 25, 2025
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు : షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, దీపక్ హుడా, సామ్ కరన్, జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివం దూబే, ఎంస్ ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పథిరన.
ఇంప్యాక్ట్ సబ్స్ : అన్షుల్ కంబోజ్, అశ్విన్, కమలేశ్ నగర్కోటి, రామకృష్ణ ఘోష్, జేమీ ఓవర్టన్.
ఐపీఎల్ 18వ సీజన్లో పేలవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నెలకొంది. ఎందుకంటే.. గెలుపొందిన జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్టే. కాబట్టి.. టర్నింగ్ పిచ్‌తో స్వాగతం పలికే సీఎస్కేను.. సన్‌రైజర్స్ టాపార్డర్ దెబ్బకొడతారా? లేదా నిలకడలేమిని కొనసాగిస్తూ తోక ముడుస్తారా? అనేది మరికాసేపట్లో తెలియనుంది. ఇప్పటివరకూ 22 సార్లు ఇరుజట్లు ఎదురుపడ్డాయి. సీఎస్కే అత్యధికంగా 16 విజయాలు నమోదు చేసింది. అయితే.. 17వ సీజన్ నుంచి రెచ్చిపోయి ఆడుతున్న హైదరాబాద్ చెన్నైకి చెక్ పెట్టాలనే కసితో ఉంది.