హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ చాంపియన్‌షిప్ స్టేజ్-1లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. కోల్‌కతాలోని కల్యాణి స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి 2-1 తేడాతోడైమండ్ హార్బర్ ఎఫ్‌సీని ఓడించి లీగ్‌లో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. తొలి అర్ధ భాగం చివర్లో వెంటవెంటనే రెండు గోల్స్ సాధించిన శ్రీనిధి ప్రత్యర్థికి చెక్ పెట్టింది.
43వ నిమిషంలో బ్రాండన్ జట్టుకు తొలి గోల్ అందించగా.. కాసేపటికే డేవిడ్ మునోజ్ (45+4వ ని) మరో గోల్‌తో 2-0తోఆధిక్యంలో నిలిపాడు. 61వ నిమిషంలో హ్యూగో డియాజ్ గోల్ చేసి హార్బర్‌ను రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ పటిష్టమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వని శ్రీనిధి విజయం అందుకుంది.