హైదరాబాద్, ఆట ప్రతినిధి: శ్రీనిధి యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (టీపీజీఎల్) శుక్రవారం అట్టహాసంగా మొదలైంది. స్థానిక హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేశ్ శర్మ టీపీజీఎల్ నాలుగో సీజన్‌ను ప్రారంభించారు. ఈనెల 2 నుంచి 30 దాకా జరిగే ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొననుండగా టాప్ 8లో నిలిచిన జట్లు నాకౌట్ స్టేజ్‌కు అర్హత సాధిస్తాయి. నాలుగో సీజన్ ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ గోల్ఫ్ ఆడి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. అనంతరం హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న హెచ్జీఎ గోల్ఫ్ క్లబ్‌ను పరిశీలించారు. డంపింగ్ యార్డును గోల్ఫ్ కోర్సునుగా మార్చి టోర్నీలను నిర్విహించడం అభినందనీయమని గవర్నర్ ప్రశంసించారు. శ్రీనిధి కేవలం చదువులకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తోందని విద్యాసంస్థల గ్రూప్ చైర్మన్ కటికనేని తాహెర్ మహి తెలిపారు