Sree Charani : మహిళల ఆసియా కప్‌లో వికెట్ల వేటతో రెచ్చిపోయిన శ్రీచరణి ( Sree Charani) మరో ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లతో చరిత్ర సృష్టించిందీ స్పిన్ సంచలనం. ఆ మధ్యే నంబర్ 1 టీ20 బౌలర్‌గా అవతరించిన ఈ తెలుగమ్మాయి తాజాగా 800 పాయింట్ల క్లబ్లో చేరింది. తద్వారా ఈ మైలురాయిని అందుకున్న టీమిండియా తొలి బౌలర్‌గా చరణి మరో రికార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆమె 804 రేటింగ్‌తో టాప్‌లో కొనసాగుతుండగా.. భారత్‌కే చెందిన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) 729 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
ఐసీసీ మహిళల టీ20 బౌలర్లలో అందరికంటే ముందున్న భారత స్పిన్నర్ శ్రీ చరణి తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇటీవల దుబాయ్‌లో ముగిసిన మహిళల ఆసియా కప్(Womens Asia Cup)లో 12 వికెట్లతో సత్తా చాటిన ఈ తెలుగమ్మాయి 800 రేటింగ్ పాయింట్లు సాధించింది. ఫైనల్లో నాలుగు వికెట్లతో భారతజట్టు ఎనిమిదోసారి ఆసియా కప్ గెలుపొందడంలో కీలకమైన చరణి 804 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. రెండో ర్యాంకర్ దీప్తి శర్మకు ఆమెకు 75 పాయింట్ల తేడా ఉంది.
Sree Charani strikes twice in quick succession, piling the pressure on Sri Lanka’s middle order. ✌️
Watch the #DPWorldWomensAsiaCup2026 FINAL LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #INDvSL #NotAGentlemansGame pic.twitter.com/NXIYwtZ22H
— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026
ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన శ్రీ చరణి నంబర్ 1 ర్యాంక్ పట్టేసింది. నిలకడగా రాణిస్తున్న ఈ తెలుగమ్మాయి అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న పొట్టి వరల్డ్‌కప్‌లో తిప్పేసిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ టాప్ ర్యాంక్‌కు ఎగబాకింది.
2025 జూన్ 28న ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన చరణి.. తన స్పిన్ మ్యాజిక్‌తో టీమిండియా విజయాల్లో కీలకవుతూనే.. వ్యక్తిగతంగా తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంది. గతేడాది స్వదేశంలో 14 వికెట్లతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకమైందీ కడప బిడ్డ.