రెజ్లర్ల ఆందోళన | డబ్ల్యూఎఫ్ఐ అదనపు కార్యదర్శి వినోద్ తోమర్‌పై వేటు
డబ్ల్యూఎఫ్ఐ అదనపు కార్యదర్శి వినోద్ తోమర్‌పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేటువేసింది. రెజర్లతో చర్చించిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. డబ్ల్యూఎఫ్ఐ అదనపు కార్యదర్శి వినోద్ తోమర్‌పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేటువేసింది. రెజర్లతో చర్చించిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్.. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని రెజ్లర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. వినోద్ తోమర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిబ్భూషణ్కు అత్యంత సన్నిహితుడు. సమాఖ్య వ్యవహారాలను ఆయనే చూసుకునేవారు. ఈ నేపథ్యంలో వినోద్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
కాగా, బ్రిజ్‌భూషణ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రవి దహియా ఆందోళనకు దిగారు. జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల ధర్నా రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.
ఈ క్రమంలో శనివారం కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించడానికి రెజ్లరు అంగీకరించారు. సమస్యపై కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తూ, సమాఖ్య అధ్యక్షుడు, కార్యదర్శిని తాత్కాలికంగా తప్పిస్తున్నట్టు తెలపడంతో ఒక పరిష్కారం లభించినైట్టెంది. వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, రవి దహియా లేవనెత్తిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు క్రీడాశాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఐవోఏ ఏర్పాటు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

