న్యూఢిల్లీ: ఖేల్ రత్నా, అర్జున అవార్డుల(National Sports Awards) కోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. అక్టోబర్ 28వ తేదీలోగా ఆ దరఖాస్తులను అందజేయాలని ప్రభుత్వం కోరింది. ప్రతి ఏడాది క్రీడా అవార్డులను రాష్ట్రపతి అందజేస్తారు. రాష్ట్రపతి భవన్లో ఈ వేడుక జరుగుతుంది. క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఖేల్ రత్నా, అర్జున అవార్డులను అందజేస్తారు. అయితే ఈ ఏడాది ఏ రోజున ఈ వేడుకను నిర్వహిస్తారన్న విషయాన్ని మాత్రం ఇంకా క్రీడాశాఖ వెల్లడించలేదు.
అర్హులైన క్రీడాకారులు, కోచ్లు,సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ శాఖ కోరింది. వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు నింపాలన్నది. మేజర్ ధ్యాన్ చంద్ అవార్డును ప్రతి ఏడాది కేవలం ఒక్క క్రీడాకారుడికి మాత్రమే ఇస్తారు. అర్జున, ద్రోణాచార్య, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డులను కూడా ప్రజెంట్ చేస్తారు.
MYAS invites applications for the prestigious National Sports Awards 2025. Eligible sportspersons, coaches and entities are invited to apply through the dedicated portal at https://t.co/b30yDTevt0.
Deadline: October 28, 2025, 11:59 pm pic.twitter.com/SArD8Nv2II
— Dept of Sports MYAS (@IndiaSports) September 29, 2025