దుబాయ్ : దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొట్జె మందలింపునకు గురయ్యాడు. జొహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్‌తో జరిగిన చివరి టీ20 పోరులో అంపైర్ నిర్ణయాన్ని తప్పు పట్టినందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఐసీసీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. తాను వేసిన బంతిని వైడ్ ప్రకటించడం పట్ల అంపైర్‌పై కొట్జె అసహనం వ్యక్తం చేశాడు. మందలింపుతో పాటు డీమెరిట్ పాయింట్ ఎదుర్కొవాల్సి వచ్చింది.