గౌహతి: దక్షిణాఫ్రికా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్(INDvSA)ను 2-0 తేడాతో సొంతం చేసుకున్నది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా 408 రన్స్ తేడాతో విజయం సాధించింది. గతంలో 2000 సంవత్సరంలో హన్సీ క్రానే నేతృత్వంలోని దక్షిణాఫ్రికా చేతిలో కూడా ఇండియా టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో 549 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్.. 63.5 ఓవర్లలో 140 రన్స్‌కే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ హార్మర్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి ఇండియాను దెబ్బతీశాడు. స్వదేశీ పిచ్‌లపై ఇండియా దారుణమైన రీతిలో ఓటమిని చవిచూసింది. మరీ 408 రన్స్ తేడాతో స్వంత పిచ్‌పై ఓడిపోవడం .. ఇండియన్ బ్యాటింగ్ లైనప్‌లో బలహీనతలను బయటపెట్టింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. 54 రన్స్ చేసిన జడేజా స్పిన్నర్ మహారాజ్ బౌలింగ్‌లో ఔటయ్యడు. క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు బ్యాటర్ సాయి సుదర్శన్ తీవ్ర ప్రయత్నం చేశాడు. అతను 139 బంతులు ఆడి కేవలం 14 రన్స్ మాత్రమే చేశాడు. కెప్టెన్ పంత్ కేవలం 13 రన్స్ చేసి నిష్క్రమించాడు. ఆల్‌రౌండర్ సుందర్ 16 రన్స్ చేయగా, ఇక నితీశ్ కుమార్ రెడ్డి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు.
South Africa win the 2nd Test by 408 runs.
They also clinch the #INDvSA Test Series by 2-0.
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/NBSFW4xtxP
— BCCI (@BCCI) November 26, 2025