ODI World Cup 2023 | ప్రపంచ కప్‌లో సఫారీ సునామీ.. రికార్డులు బద్ధలు కొడుతున్న బవుమా బ్యాచ్
ODI World Cup 2023 : తొలి ఐసీసీ ట్రోఫీకోసం ఆకలిగొన్న పులిలా ఉన్న దక్షిణాఫ్రికా జట్టు వన్డే ప్రపంచ కప్‌లో చెలరేగి ఆడుతోంది. మొదట బ్యాటింగ్ ఇస్తే చాలు.. సఫారీ బ్యాటర్లు పూనకం వచ్చినట్టు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. వీళ్లకు తోడు బౌలర్లు కూడా దుమ్మురేపుతుండడంతో..
ODI World Cup 2023 : తొలి ఐసీసీ ట్రోఫీకోసం ఆకలిగొన్న పులిలా ఉన్న దక్షిణాఫ్రికా జట్టు వన్డే ప్రపంచ కప్‌లో చెలరేగి ఆడుతోంది. మొదట బ్యాటింగ్ ఇస్తే చాలు.. సఫారీ బ్యాటర్లు పూనకం వచ్చినట్టు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. వీళ్లకు తోడు బౌలర్లు కూడా దుమ్మురేపుతుండడంతో సఫారీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. బుధవారం పుణే వేదికగా 2019 రన్నరప్ న్యూజిలాండ్‌ను 190 పరుగుల తేడాతో మట్టికరిపించి.. ఆరో విజయంతో సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. అంతేకాదు వన్డే క్రికెట్ చరిత్రలో కివీస్‌పై రికార్డు విక్టరీ నమోదు చేసింది.
వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును సఫారీ జట్టు బద్ధలు కొట్టింది. ఇప్పటివరకూ 7 మ్యాచ్‌లు ఆడిన దక్షిణాఫ్రికా జట్టు రికార్డు స్థాయిలో 82 సిక్స్‌లు కొట్టింది. దాంతో, 2019 ఎడిషన్‌లో ఇంగ్లండ్ 76 సిక్సర్లతో నెలకొల్పిన రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఇక.. కరీబియన్ జట్టు 2015 వరల్డ్ కప్‌లో 68 సిక్సర్లతో మూడో స్థానంలో నిలవగా.. ఆస్ట్రేలియా 2007లో 67 సిక్సర్లతో నాలుగో స్థానం దక్కించుకుంది. 2023 ఎడిషన్‌లో కంగారూ జట్టు ఇప్పటివరకూ 61 సిక్సర్లు బాది.. ఐదో ప్లేస్‌లో నిలిచింది.
10 విజయాలు
దక్షిణాఫ్రికా జట్టు ఈ ఏడాది వన్డేల్లో తిరుగులేని విజయాలు సాధిస్తోంది. ఇప్పటి వరకూ 11 వన్డేల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్ ఏకంగా 10 మ్యాచుల్లో జయకేతనం ఎగురువేసింది. ఆ ఒక్కటి కూడా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

కివీస్‌కు షాక్
టీమిండియా చేతిలో పరాజయం పాలైన కివీస్‌కు ప్రొటీస్ జట్టు భారీ షాకిచ్చింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పుణే పిచ్‌పై ఓపెనర్ క్వింటన్ డికాక్(114), డస్సెన్(133) సెంచరీలతో కదం తొక్కడంతో సఫారీ జట్టు 357 పరుగులు చేసింది. భారీ ఛేదనలో కేశవ్ మహరాజ్ (4 వికెట్లు), మార్కో జాన్సేన్(3 వికెట్లు) విజృంభించడంతో కివీస్ 167 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్ ఒక్కడే అర్థ శతకంతో రాణించాడు.
ఇవి కూడా చదవండి
IND vs SL | సెమీస్ లక్ష్యంగా.. శ్రీలంకతో టీమ్ ఇండియా పోరు నేడు
ఢిల్లీ, ముంబై వేదికల్లో పటాకులపై నిషేధం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

