విండోక్: దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ సెంచరీతో కదం తొక్కాడు. నమీబియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో లుహన్ డ్రీ ప్రిటోరియస్ కేవలం 53 బంతుల్లో 101 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 11 రన్స్ తేడాతో దక్షిణాఫ్రికా విజయం నమోదు చేసింది. ప్రిటోరియస్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 రన్స్ చేసింది. రసవత్తరంగా సాగిన లక్ష్యచేధనలో నమీబియా నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 217 రన్స్ చేసింది.
ప్రిటోరియస్ తన సెంచరీతో రికార్డు బుక్కుల్లోకి ఎక్కాడు. 20 ఏళ్ల 161 రోజుల వయసులోనే అతను అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను ఆఫ్ఘన్ బ్యాటర్ హజ్రతుల్లా జాజాయ్ రికార్డును బ్రేక్ చేశాడు. హజ్రతుల్లా 20 ఏళ్ల 337 రోజుల వయసులో ఐర్లాండ్‌పై సెంచరీ కొట్టాడు. చిన్న వయసులోనే సెంచరీ కొట్టి రికార్డు ప్రిటోరియస్ పేరిట నమోదు కావడంతో.. ఇక భారత బ్యాటర్ సూర్యవంశీకి అది సవాల్‌గా మారనున్నది. ఇప్పటికే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్లో తొలి సెంచరీ నమోదు చేయాలన్న కాంక్షతో ఉన్నాడు.
ఇక ప్రిటోరియస్, సూర్యవంశీ ఇద్దరూ.. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతారు. 15 ఏళ్ల వయసులోనే సూర్యవంశీ పలు రికార్డులను క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు నమోదు చేశాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో హాప్ సెంచరీ కొట్టిన యువ బ్యాటర్‌గా కూడా రికార్డు ఉన్నది.
Maiden T20I century for Lhuan-Dre Pretorius against Namibia 💯🤩
📝: https://t.co/k5ZRX1E3Zq pic.twitter.com/xCs6BVn8Ro
— ICC (@ICC) September 4, 2026