Anaya Bangar Row | మహిళల క్రికెట్లో ట్రాన్స్‌జెండర్‌ను ఎలా అనుమతిస్తారు?. ఆస్ట్రేలియాపై కాప్ ఆగ్రహం..!
Anaya Bangar Row : లింగమార్పిడి చేసుకొని అమ్మాయిగా మారిన అనయా బంగర్(Anaya Bangar) పునరామనానికి ముందే విమర్శలు ఎదుర్కొంటోంది. ఆమెను మహిళల బిగ్‌బాష్ లీగ్(WBBL)లో ఆడేందుకు అనుమతించడంపై మరిజానే కాప్(Marizanne Kapp) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Anaya Bangar Row : లింగమార్పిడి చేసుకొని అమ్మాయిగా మారిన అనయా బంగర్(Anaya Bangar) పునరామనానికి ముందే విమర్శలు ఎదుర్కొంటోంది. ఆమెను మహిళల బిగ్‌బాష్ లీగ్(WBBL)లో ఆడేందుకు అనుమతించడంపై మరిజానే కాప్(Marizanne Kapp) ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రాన్స్‌జెండర్ అయిన అనయను మహిళల క్రికెట్లో అనుమతించడం సమంజసం కాదని ఆమె క్రికెట్ ఆస్ట్రేలియాపై మండిపడింది. ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లకు మహిళల క్రికెట్లో అవకాశం లేదని దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ స్పష్టం చేసింది.
అబ్బాయిగా పుట్టి జూనియర్ స్థాయిలో క్రికెట్లో ఆడి.. ఇటీవలే లింగమార్పిడితో అమ్మాయిగా మారిన అనయా బంగర్‌కు చిక్కులు మొదలయ్యాయి. మహిళల క్రికెట్లో ఆడేందుకు సిద్దమవుతున్న ఆమెపై విమర్శలు గుప్పించింది దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మరిజానే కప్. ట్రాన్స్‌జెండర్ అయిన అనయను మహిళల క్రికెట్లో అనుమతించిన క్రికెట్ ఆస్ట్రేలియాపై కాప్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది.
Marizanne Kapp’s Instagram story on Anaya Bangar. pic.twitter.com/ofbDpVXYPi
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 28, 2026
అనయా బౌలింగ్ చేస్తున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పెట్టిన కాప్.. ‘ఇది వంద శాతం పిచ్చితనం. ఇందుకు అనుమతించకూడదు’ అని కామెంట్ రాసింది. అనయను మహిళల క్రికెట్లో అనుమతించడంపై వ్యతిరేక వ్యక్తం చేసిన తొలి క్రికెటర్ కాప్. అయితే.. తమదేశానికే చెందిన మహిళా క్రికెటర్ డానే వాన్ నీకెర్క్‌ను పెళ్లాడిన కాప్ పోస్ట్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
ఐదు నెలల క్రితం
భారత మాజీ క్రికెటర్ సంజయ బంగర్ కూతురు అనయా బంగర్ మళ్లీ క్రికెట్ ప్రయాణాన్ని మొదలెట్టనుంది. ఒకప్పుడు అబ్బాయిలతో కలిసి ఆడిన తను.. ఈసారి అమ్మాయిలతో మైదానంలోకి దిగనుంది. ఐదు నెలల క్రితం లింగ మార్పిడి సర్జరీ చేయించుకున్న ఆమెకు ఎట్టకేలకు ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ అనుమతి లభించింది. అయితే.. టెస్టోస్టిరాన్ పరీక్షల తర్వాతే అనయకు అవకాశం దక్కనుంది.

అబ్బాయిగా పుట్టిన అనయా బంగర్ లింగమార్పిడి సర్జరీతో అమ్మాయిగా మారింది. ఈ ఏడాది మార్చిలో సర్జరీ అనంతరం మళ్లీ క్రికెట్లో పునరాగమనానికి సిద్ధమవుతోంది. ఇటీవలే ఆమెకు ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. మహిళల బిగ్ బాష్ లీగ్ వంటి టోర్నీల్లో ఆడాలంటే అనయ టెస్టోస్టిరాన్(Testosteron) పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే.. మహిళల ఎలైట్ క్రికెట్లో ట్రాన్స్జెండర్లపై ఐసీసీ 2023లో నిషేధం విధించింది. అప్పటినుంచి లింగమార్పిడి చేసుకున్నవాళ్లకు టెస్టోస్టిరాన్ పరీక్ష తప్పనిసరైంది.
#WATCH | Mumbai, Maharashtra: On making a comeback in cricket, Anaya Bangar, a cricketer and the daughter of former Indian international cricketer and national batting coach, Sanjay Bangar, said, “…I am preparing to return to women’s cricket in Australia with the aim of… pic.twitter.com/NVgrICOjgT
— ANI (@ANI) August 27, 2026
‘క్రికెట్ ఆస్ట్రేలియా ఎలైట్ క్రికెట్ విధానం ప్రకారం ట్రాన్స్జెండర్లు, లింగ వైవిధ్యమున్న క్రికెటర్లకు సీరమ్ టెస్టోస్టిరాన్ పరీక్ష తప్పనిసరి. దాదాపు 12 నెలలుగా వీరిలో లీటర్‌కు 10 నానోమోల్స్ కంటే తక్కువగా సీరమ్ టెస్టోస్టిరాన్ ఉండాలి. 2027 మార్చి నుంచి ఎలైట్ క్రికెట్లోకి నీకు అనుమతిస్తున్నాం. ఆస్ట్రేలియాలో ఉన్నప్పటి నుంచి నీ రక్తనమూనాల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు 10 నానోమోల్స్ కంటే తక్కువ ఉన్నాయి. దాంతో, నువ్వు నిర్దేశించిన ప్రమాణాలు అందుకున్నావు’ అని క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రిటీ హెడ్ జాక్వీ పార్ట్రిడ్జ్ అనయకు శుభవార్త చెప్పింది.

టీమిండియా వెటరన్ సంజయ్ బంగర్, కశ్మీరా (వైశాలి) దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి అబ్బాయి పేరు అథర్వ, రెండో కుమారుడి పేరు పుట్టి.. అర్యన్. ఈ ఇద్దరిలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆర్యన్ అండర్ -16, అండర్ -19 విభాగాల్లో భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan), అతడి సోదరుడు ముషీర్ ఖాన్‌లతో కలిసి క్రికెట్ ఆడాడు. కానీ, ఇప్పుడు ఆర్యన్ కాస్త అనయాగా అంటే అమ్మాయిగా మారాడు.
కొన్నాళ్లుగా ‘ట్రాన్స్‌జెండర్ ఉమెన్’గా వార్తల్లో నిలిచిన అనయా థాయ్‌లాండ్‌లో ఈ ఏడాది మార్చిలోతేదీన లింగ మార్పిడి సర్జరీ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. 2023లో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకున్న అనయ ఆ థెరపీ దశలను వెల్లడించడం పెద్ద దుమారం రేపింది. ఈ క్రమంలో తీవ్ర విమర్శలు ఎదురైనా సరే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భవిష్యత్‌లో అమ్మాయిగానే తనను తాను ఊహించుకున్న అనయ.. ఎట్టకేలకు లింగ మార్పిడి సర్జరీతో తాను కలగన్న జీవితాన్ని మొదలుపెట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

