ICC Women’s ODI Team | ఉమెన్స్ వన్డే టీమ్‌ను ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ముగ్గురికి చోటు
ICC Women's ODI Team | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 ఏడాదికిగాను ప్రకటించిన ఐసీసీ ఉమెన్స్ వన్డే జట్టులో భారత్ నుంచి ముగ్గురు మహిళా క్రికెటర్లకు చోటుదక్కింది. వారిలో స్టార్ బ్యాటర్లు స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్, స్టార్ పేసర్ రేణుకాసింగ్ ఉన్నారు.
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 ఏడాదికిగాను ప్రకటించిన ఐసీసీ ఉమెన్స్ వన్డే జట్టులో భారత్ నుంచి ముగ్గురు మహిళా క్రికెటర్లకు చోటుదక్కింది. వారిలో స్టార్ బ్యాటర్లు స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్, స్టార్ పేసర్ రేణుకాసింగ్ ఉన్నారు. వివిధ దేశాలకు చెందిన 11 మంది మహిళా క్రికెటర్లతో కూడిన జట్టును ఐసీసీ మంగళవారం ఉదయం ప్రకటించింది.
‘2022 ఏడాదికిగాను తాము ప్రపంచంలోని 11 మంది అద్భుతమైన మహిళా క్రికెటర్ల పేర్లతో ఐసీసీ ఉమెన్స్ వన్డే టీమ్‌ను ప్రకటించాం. ఈ టీమ్‌లో గత ఏడాది బ్యాటుతో, బాల్‌తో, ఆల్రౌండర్లుగా ప్రతి ఒక్కరినీ మెప్పించిన క్రికెటర్లు ఉన్నారు. 2022లో అత్యత్భుత ప్రతిభ కనబర్చిన క్రికెటర్లతో ఈ జట్టును రూపొందించాం.’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. ఇక ఐసీసీ ప్రకటించిన ఆ 11 మంది ప్లేయర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
1. అలీసా హీలీ (వికెట్ కీపర్-ఆస్ట్రేలియా)
అలీసా వికెట్ కీపర్‌గా, ఓపెనింగ్ బ్యాటర్‌గా అద్భుత ప్రతిభ చూపింది. మహిళా క్రికెట్ ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో హోరాహోరిగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 129 పరుగులు, ఫైనల్లో ఇంగ్లండ్‌పై చేసిన 170 పరుగులు చేసి ఆస్ట్రేలియా జట్టు ప్రపంచకప్ గెలువడంలో కీలకపాత్ర పోషించింది.
2. స్మృతి మందన (భారత్)
ఈ ఎడమచేతి వాటం స్టార్ బ్యాటర్ 2022లో పరుగుల వరద పారించింది. వన్డేల్లో మొత్తం ఆరు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేసింది. న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి 123 పరుగులు చేసి భారత్ విజయంలో కీ రోల్ పోషించింది. ఆ తర్వాత 2022 ఆఖరులో ఇంగ్లండ్ టూర్లో కూడా స్మృతి అద్భుత ప్రదర్శన చేసింది.
3. లౌరా వోల్వార్ట్ (దక్షిణాఫ్రికా)
ఈ 23 ఏండ్ల క్రికెటర్ 2022 ఏడాదిని సొంతగడ్డపై తనదైన రీతిలో మొదలుపెట్టింది. ప్రపంచకప్ ఆద్యంతరం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. గత ఏడాది ఫిబ్రవరిలో జోహన్నెస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌పై 117 పరుగులు చేసింది. ఆ తర్వాత ప్రపంచకప్‌లో నాలుగు అర్ధసెంచరీలతో కదం తొక్కింది.
4. నాట్ స్కివర్ (ఇంగ్లండ్)
ఉమెన్ క్రికెట్ ప్రపంచకప్‌లో నాట్ స్కివర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఆ టోర్నీ మొత్తంలో రెండు సెంచరీలు సహా మొత్తం 436 పరుగులు చేసింది. అందులో ఆస్ట్రేలియాపై చేసిన సెంచరీ (148 నాటౌట్) చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆ సెంచరీ చేయకపోతే ఆ రోజు ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ ఓడిపోయేది.
5. బెత్ మూనీ (ఆస్ట్రేలియా)
బెత్ మూనీ ఆస్ట్రేలియా జట్టుకు ఆణిముత్యమనే చెప్పాలి. ఎందుకంటే ఆమె తన సొగసైన ఆటతీరుతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంటుంది. 2022లో ఆమె కేవలం 10 ఇన్నింగ్స్ మాత్రమే ఆడి 100 పరుగుల సగటు, 96.41 స్ట్రైక్ రేటుతో 403 పరుగులు రాబట్టింది. అంతేగాక 10 ఇన్సింగ్స్‌లో ఆమె కేవలం నాలుగు సార్లు మాత్రమే ఔటయ్యింది.
6. హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్)
హర్మన్ భారత మహిళా క్రికెట్ జట్టులో ఒక అనుభవశాలి అయిన ఆల్‌రౌండర్. 2022లో ఆమె మొత్తం రెండు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలు బాదింది. గత సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌పై కొట్టిన 143 పరుగులు 2022లో ఆమె అత్యధిక వ్యక్తిగత స్కోరు. బ్యాటింగ్లోనేగాక బౌలింగ్‌లోనూ కౌర్ తన వంతు పాత్ర పోషించింది. అత్యవసర సమయాల్లో బౌలింగ్ చేసి ఐదు కీలక వికెట్లు పడగొట్టింది.
7. అమేలియా కెర్ (న్యూజిలాండ్)
న్యూజిలాండ్ జట్టులో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన అమేలియా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కూడా ఎన్నో ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడింది. 2022లో బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో ఆమె రాణించింది. 22 ఏండ్ల అమేలియా 2022లో వన్డేల్లో మొత్తం 676 పరుగులు చేసింది. అటు బౌలింగ్‌లోనూ 17 విలువైన వికెట్లు పడగొట్టింది.
8. సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్)
ఇంగ్లండ్‌కు చెందిన ఈ స్పిన్ బౌలర్ వన్డే బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్నది. 2022లో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఆమె అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచకప్‌లోనే ఏకంగా 22 వికెట్లు పడగొట్టింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 36 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టింది. అదే ఆమె అత్యుత్తమ బౌలింగ్ స్పెల్.
9. అయబొంగా ఖాకా (దక్షిణాఫ్రికా)
అయబొంగా 2022 క్యాలెండర్ ఇయర్లో అద్భుతమైన ఆటతీరు కనబర్చింది. కేవలం 18 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడి 27 వికెట్లు పడగొట్టింది. జోహన్నెస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది.
10. రేణుకా సింగ్ (భారత్)
భారత్ ఫాస్ట్ బౌలర్ అయిన రేణుకాసింగ్ 2022లోనే వన్డేల్లో అరంగేట్రం చేసింది. టీ20ల్లోనూ రేణుకకు మంచి రికార్డు ఉంది. అయితే 2022లో కేవలం ఏడు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రేణుకాసింగ్ 18 వికెట్లు పడగొట్టింది. శ్రీలంకతో మ్యాచ్‌లో 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. అదే రేణుక కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ స్పెల్.
11. షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా)
ఎవర్గ్రీన్ పేసర్‌గా షబ్నిమ్ ఇస్మాయిల్‌కు మంచి రికార్డు ఉంది. 34 ఏండ్ల వయసులోనూ ఆమె యువ ఆటగాళ్లతో పోటీపడి రాణిస్తున్నారు. 2022లో 17 వన్డే మ్యాచ్‌లు ఆడిన షబ్నిమ్ ఏకంగా 37 వికెట్లు పడగొట్టింది. గత ఏడాది మిడిల్లో ఐర్లాండ్‌పై డబ్లిన్‌లో ఆమె కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసింది. అదే షబ్నీమ్ కెరీర్ బెస్ట్ ప్రదర్శన.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

