IPL 2021: రాణించిన పృథ్వీ షా..ఢిల్లీ స్కోర్ 159

చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్ పృథ్వీ షా(53: 39 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్) అర్ధశతకానికి తోడు రిషబ్ పంత్(37: 27 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్) రాణించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(28) స్వేచ్ఛగా ఆడలేకపోయాడు.
చివర్లో స్టీవ్ స్మిత్(34 నాటౌట్: 25 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్) విజృంభించడంతో ఆ జట్టు 150 మార్క్ దాటింది. సన్‌రైజర్స్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్(2/31) ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. జగదీశ సుచిత్ నాలుగు ఓవర్లు వేసి 21 పరుగులే ఇచ్చాడు. విజయ్ శంకర్(0/19) సైతం ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి శుభారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా దూకుడుగా ఆడటంతో పవర్‌ప్లే ఆఖరికి ఢిల్లీ 51/0తో నిలిచింది. యువ బ్యాట్స్‌మన్ షా ధనాధన్ 35 బంతుల్లోనే 7ఫోర్లు, సిక్స్ సాయంతో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రషీద్ ఖాన్ వేసిన 11వ ఓవర్లో ధావన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే షా రనౌటై వెనుదిరగడంతో ఢిల్లీ స్కోరు వేగం తగ్గింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్, స్మిత్ నిలబడటంతో ఢిల్లీ ఆ మాత్రం స్కోరైనా చేసింది.
Innings Break: Prithvi Shaw’s half-century and contributions from middle order guide #DC to 159-4.
— IndianPremierLeague (@IPL) April 25, 2021
Stay tuned for the chase. https://t.co/9lEz0r9hZo #SRHvDC #VIVOIPL pic.twitter.com/AVd8ebr8Yr
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

