చెన్నై: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 138 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో ఓవర్లోనే యువ ఓపెనర్ పృథ్వీ షా వికెట్ కోల్పోయింది. జయంత్ యాదవ్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో వికెట్ పడకుండా స్టీవ్ స్మిత్, శిఖర్ ధావన్ జాగ్రత్తగా ఆడుతున్నారు. నిదానంగా ఆడుతూ భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నారు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్లో ఎక్కువగా సింగిల్స్ తీయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కృనాల్ పాండ్య వేసిన 9వ ఓవర్లో స్మిత్ రెండు ఫోర్లు బాది 12 పరుగులు రాబట్టాడు. 9 ఓవర్లకు 64/1 నిలిచిన ఢిల్లీ విజయానికి ఇంకా 66 బంతుల్లో 74 పరుగులు చేయాల్సి ఉంది. స్మిత్(33), ధావన్(20) క్రీజులో ఉన్నారు.
A fine 50-run partnership comes up between @SDhawan25 & @stevesmith49 👌
— IndianPremierLeague (@IPL) April 20, 2021
Live – https://t.co/9JzXKHJrH8 #DCvMI #VIVOIPL pic.twitter.com/HtRruBTrxA