షార్జా: రెండు జట్లతో దోబూచులాడిన విజయం చివరకు దక్షిణాఫ్రికానే వరించింది. టీ20 ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్య ఛేదనలో క్వింటాన్ డికాక్ (12), రీజా హెండ్రిక్స్ (11), వ్యాన్ డర్ డస్సెన్ (16), మార్క్రమ్ (19) పరుగులు చేయగా.. కెప్టెన్ టెంబా బవుమా (46) నిలబడటంతో ఛేజింగ్ సాఫీగా సాగింది.
అయితే అతను భారీ షాట్లు ఆడకపోవడంతో చివర్లో ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అలాంటి సమయంలో డేవిడ్ మిల్లర్ (23) వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాది టెన్షన్ తగ్గించాడు. ఆ తర్వాత ఫోర్ కొట్టిన రబాడ (13) లాంఛనం పూర్తి చేశాడు.
దీంతో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం నమోదు చేసింది. దీంతో గ్రూప్-1లో ఆడిన మూడు మ్యాచుల్లో దక్షిణాఫ్రికా రెండు విజయాలు నమోదు చేయగా, శ్రీలంక మాత్రం మూడింట రెండు ఓటములను చవిచూసింది. లంక బౌలర్లలో హసరంగ 3, చమీర 2 వికెట్లు పడగొట్టారు.