న్యూఢిల్లీ: కేంద్ర క్రీడాశాఖ తీసుకొచ్చిన టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్(టాప్స్)లో ఆరుగురు పారా అథ్లెట్లకు చోటు కల్పించారు. మిషన్ ఒలింపిక్ సెల్లో భాగంగా భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్)మెరుగైన శిక్షణ పొందేందుకు వీరికి అవకాశం లభించింది.
కోర్ గ్రూపులో మానసి జోషి(బ్యాడ్మింటన్), ధరమ్‌బీర్(క్లబ్‌త్రో), సోమేశ్వర్రావు(లాంగ్‌జంప్), నిత్య శ్రీ(బ్యాడ్మింటన్), మన్‌దీప్‌కౌర్(బ్యాడ్మింటన్), మనీశా రామదాస్(బ్యాడ్మింటన్) చోటు దక్కించుకున్నారు. ఫిన్లాండ్లో మెరుగైన శిక్షణ తీసుకునేందుకు స్టార్ జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జఝారియాకు సాయ్ చాన్స్ కల్పించింది. యూరప్‌లోనే జఝారియా శిక్షణ కోసం రూ.11.5 లక్షలు ఖర్చవుతుందని సాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది.