సిరాజ్, ముకేశ్ మెరిసినా..న్యూజిలాండ్-ఏ భారీ స్కోరు
న్యూజిలాండ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌కు ముందు సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ (4/118) లయ అందుకున్నా, మరో పేసర్ ముకేశ్ కుమార్ (5/87) ఐదు వికెట్లతో మెరిసినా ప్రత్యర్థికి భారత్-ఏ ఆధిక్యాన్ని సమర్పించుకుంది.
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌కు ముందు సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ (4/118) లయ అందుకున్నా, మరో పేసర్ ముకేశ్ కుమార్ (5/87) ఐదు వికెట్లతో మెరిసినా ప్రత్యర్థికి భారత్-ఏ ఆధిక్యాన్ని సమర్పించుకుంది. న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న అనధికారిక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్యజట్టు 424 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఓవర్‌నైట్ స్కోరు 218/3తో మూడో రోజు బ్యాటింగ్ చేసిన ఆ జట్టును మిడిలార్డర్, లోయరార్డర్ బ్యాటర్లు పటిష్ట స్థితిలో నిలిపి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు 78 రన్స్ ఆధిక్యాన్ని అందించారు. సెంచరీ హీరో బాయిల్ (110), ఫాక్స్‌క్రాఫ్ట్ (93) వెంటనే నిష్క్రమించినా లోయరార్డర్లో క్రిస్టియన్ క్లార్క్ (41), ఫ్రేసర్ (40), లెనాక్స్ (32 నాటౌట్), మెక్కాయ్ (33) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 346 రన్స్‌కు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆట చివరికి సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 32 రన్స్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- India
- Mukesh
- New Zealand
- odi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

