సెంచూరియన్: క్రికెట్లో వికెట్ పడితే ఆ కిక్కే వేరు. ఇక ఆ సమయంలో బౌలర్ సెలబ్రేట్ చేసుకునే స్టయిల్ కూడా వేరుంటుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో.. ఇండియన్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఫుల్ జోష్‌లో కనిపించాడు. సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రసీ వాండర్ దుసేన్ వికెట్ తీసిన సమయంలో సిరాజ్ యమ ఎంజాయ్ చేశాడు. స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్.. పోర్చుగీస్ హీరో క్రిస్టియానో రోనాల్డో టైప్‌లో హంగామా క్రియేట్ చేశాడు. ఫుట్‌బాల్ టోర్నీల్లో గోల్ కొట్టిన తర్వాత.. రోనాల్డో తనదైన స్టయిల్లో ఆ మూమెంట్‌ను సెల్రబేట్ చేసుకుంటాడు. గోల్ పోస్టు నుంచి పరుగెత్తి మరీ .. గాలిలో ఎగిరి పంచ్ ఇస్తూ ఆ ఆనందంలో తేలిపోతాడు. దీన్ని సియూ సెలబ్రేషన్ అని కూడా అంటారు. అచ్చం అలాగే సిరాజ్ కూడా చిందేశాడు. వాండర్ దుసేన్ను ఔట్ చేసిన తర్వాత పరుగెత్తి.. గాలిలోకి ఎగిరి.. చేతులతో పంచ్ ఇస్తూ.. రోనాల్డో స్టయిల్లో వికెట్ తీసిన సంబరాన్ని జరుపుకున్నాడు. ఫస్ట్ టెస్టులో ఇప్పటికే ఇండియా 146 రన్స్ ఆధిక్యాన్ని సాధించింది. అయితే సిరాజ్ ఎంజాయ్ చేసిన ఆ వీడియోను మీరూ చూడండి. సియూ సంబరాలు బీసీసీఐ క్యాంపులోకి వచ్చినట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఓ ట్వీట్ చేసింది.