Davis Cup 2023 : వరల్డ్ నంబర్ 4 జన్నిక్ సిన్నర్(Jannik Sinner) అసమాన పోరాటంతో ఇటలీని డేవిస్ కప్(Davis Cup 2023) ఫైనల్‌కు చేర్చాడు. శనివారం హోరాహోరీగా జరిగిన సెమీస్‌లో సిన్నర్.. వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic) 21 విజయాల రికార్డుకు చెక్ పెట్టాడు. తొలుత సింగిల్స్‌లో 1-1తో డ్రా చేసుకున్న సిన్నర్.. అనంతరం డబుల్స్‌లో లొరెంజో సొనెగోతో కలిసి జకో, కెమనోవిక్ జంటను 6-3, 6-4తో చిత్తుచేశాడు.
ఈ మ్యాచులో సిన్నర్ వరుసగా మూడు మ్యాచ్ పాయింట్లు గెలిచి ఇటలీని 25 ఏండ్ల తర్వాత టైటిల్ పోరుకు తీసుకెళ్లాడు. 1998 తర్వాత ఇటలీ ఈ టోర్నీ ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. టైటిల్ పోరులో ఇటలీ బలమైన ఆస్ట్రేలియా(Australia)ను ఢీకొట్టనుంది.
No words just pure joy. #DavisCupFinals | @federtennis pic.twitter.com/RRjqzjXjGv
— Davis Cup (@DavisCup) November 25, 2023
నొవాక్ జకోవిచ్

అలెక్సీ పొపైరిన్(Alexei Popyrin) సెమీఫైనల్లో అతడు అద్భుత విజయం సాధించడంతో ఆస్ట్రేలియా డేవిస్ కప్(Davis Cup 2023) ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో 40వ ర్యాంకర్ అలెక్సీ.. ఒట్టో విర్టనెన్(ఫిన్లాండ్)పై గెలుపొందాడు. దాంతో, ఆసీస్ వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. నిరుడు కెనడా చేతిలో కంగుతిన్న ఆ జట్టు ఈసారి టైటిల్ అందుకోవాలనే పట్టుదలతో ఉంది. డేవిస్ కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాకు 28-20 రికార్డు ఉండడం గమనార్హం. ఈ జాబితాలో అమెరికా (32-29) అగ్రస్థానంలో ఉంది.