Shardhul Thakur : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌కు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. మినీ వేలానికి సమయం దగ్గరపడుతుండడంతో స్టార్ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం, విఫలమైనవాళ్లను వదులుకోవడంతో పాటు ఇతర జట్లకు ఆటగాళ్లను బదిలీ చేయడం వంటివి ఊపందుకున్నాయి. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్(Shardhul Thakur)కు పెద్ద షాకిచ్చింది.
16వ సీజన్లో విఫలమైన అతడిని వదలుకుంటన్నట్టు ప్రకటించింది. నిరుడు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి శార్ధూల్‌ను రూ.10.75 కోట్లకు కోల్‌కతా కొనుగోలు చేసింది. అయితే.. ఈ ఆల్‌రౌండర్ బ్యాటుతో, బంతితో తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 7 వికెట్లు తీసి.. బ్యాటుతో 113 పరుగులు చేశాడంతే. పైగా ‘ఇంపాక్ట్ ప్లేయర్'(Imapact Player) రూల్‌తో స్పెషలిస్ట్ బౌలర్ లేదా బ్యాటర్‌ను తీసుకునే చాన్స్ ఉంది. దాంతో, కోల్‌కతా మినీ వేలంలో శార్దూల్ స్థానంలో ప్రతిభావంతుడైన ప్లేయర్‌ను తీసుకోవాలని కోల్‌కతా భావిస్తోంది. మాజీ కెప్టెన్ గౌతం గంభీర్(Gautam Gambhir) మెంటార్‌గా మళ్లీ కోల్‌కతా గూటికి చేరిన వెంటనే శార్దూల్‌పై వేటు పడడం గమనార్హం.శార్దూల్ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున నాలుగు సీజన్లు ఆడాడు.
ఇంగ్లండ్ పర్యటనలో లార్డ్స్ టెస్టులో అదరగొట్టిన శార్దూల్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆల్‌రౌండర్‌గా టీమిండియాలో చోటు ఖాయం చేసుకున్నాడు. అయితే.. స్వదేశంలో జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ, ఈ ఏడాది జూన్‌లో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC 2023) ఫైనల్లో అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే.. బ్యాకప్ ఆల్‌రౌండర్‌గా పనికొస్తాడని వరల్డ్ కప్ స్క్వాడ్‌కు ఎంపిక చేశారు. కానీ, అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం రాలేదు.