సింగాపూర్: భారత షట్లర్లకు సింగపూర్ ఓపెన్‌లో చుక్కెదురైంది. స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ సహా పోటీలో ఉన్నవారంతా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సిరీస్ సూపర్-750 పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో గురువారం శ్రీకాంత్ 15-21, 19-21తో చై హావ్ లీ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు.
37 నిమిషాల పాటు సాగిన పోరులో శ్రీకాంత్ ప్రభావం చూపలేకపోయాడు. మరో మ్యాచ్‌లో యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ 17-21, 16-21తో మూడో సీడ్ కొడాయి నరొకా చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో అర్జున్-ధ్రువ్ జంట కూడా నిష్క్రమించింది.