Hong Kong Open | తొలి రౌండ్లోనే సింధు నిష్క్రమణ.. ప్రణయ్, లక్ష్యసేన్ ముందంజ..!
Hong Kong Open : గత ఏడాది కాలంగా మేజర్ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ (Hong Kong Open) తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది.
Hong Kong Open : గత ఏడాది కాలంగా మేజర్ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న పీవీ సింధు (PV Sindhu) మరోసారి నిరాశపరిచింది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ (Hong Kong Open) తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో డెన్మార్క్‌కు చెందిన లినే క్రిస్టోఫెర్సెన్ చేతిలో సింధు అనూహ్యంగా కంగుతిన్నది. గతంలో లినేను ఐదుసార్లు చిత్తు చేసిన భారత స్టార్ ఈసారి మాత్రం చేతులెత్తేసింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ ముందంజ వేశారు.
ఈమధ్యే ముగిసిన బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రెండో సీడ్‌పై గెలుపిందిన సింధు హాంకాంగ్ ఓపెన్‌లోనూ పేలవ ఆటకు మూల్యం చెల్లించుకుంది. ఆరంభంలో దూకుడుగా ఆడి 21-15తో తొలి సెట్ గెలుపొందినప్పటికీ అదే దూకుడు కొనసాగించలేక ప్రత్యర్థికి అవకాశమిచ్చింది. రెండో సెట్లో పుంజుకున్న లినే 16-21తో పైచేయి సాధించింది. నిర్ణయాత్మక మూడో సెట్లో సింధు పోరాడినపన్పటికీ 19-21తో పరాజయం పాలైంది.
This is the first time Line Christophersen beat PV Sindhu 🤯
Sindhu won each of their previous five encounters until they met at the Hong Kong Open 2025, when Line Christophersen came from behind to win the match and advance to the next round 🏸 🏆
➡️ Read the full story… pic.twitter.com/QxoF6jWvD1
— ESPN India (@ESPNIndia) September 10, 2025
పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్, కిరణ్ జార్జ్, ఆయుష్ శెట్టిలు తమ రాకెట్ పవర్ చూపించారు. చైనాకు చెందిన గాంజ్ జూను మట్టికరిపించి ప్రణయ్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. టీ.డబ్యూ. వాంగ్‌ను 22-20, 16-21, 21-15తో ఓడించి సేన్ ముందంజ వేశాడు. యువకెరటం జార్జ్ సైతం ప్రత్యర్థి టీ.జేసన్‌కు చెక్ పెట్టి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు.
Perfect Start for Indian Men’s Singles at Hong Kong Open S500
All four Indians in men’s singles have advanced to Round 2 with convincing wins at #HongKongOpenSuper500
Next Round Line-up:
💥 Ayush G. will take on the winner of Kodai Naraoka vs Viktor Axelsen
💥 HS Prannoy vs… pic.twitter.com/YsiV9Ytypd— IndiaSportsHub (@IndiaSportsHub) September 10, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

