పారిస్: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సిరీస్ సూపర్ -750 టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-18, 21-14తో చోయి సోల్-కిమ్ వోన్ (కొరి యా) ద్వయంపై గెలుపొందింది.
క్వార్టర్స్‌లో టాప్ సీడ్‌ను చిత్తు చేసిన మన షట్లర్లు.. సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ వరుస గేమ్‌ల్లో నెగ్గారు. 45 నిమిషాల పోరులో భారత జోడీ అటాకింగ్ గేమ్‌తో ఆకట్టుకుంది.