గువహటి: భారత యువ షట్లర్ సతీశ్ కరుణాకరన్ గువహటి మాస్టర్స్‌లో పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. సతీశ్‌తో పాటు మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్ భారత ద్వయం తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప సైతం టైటిల్‌ను నిలబెట్టుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో సతీశ్.. 21-17, 21-14తో ఝు జువాన్ (చైనా)ను చిత్తు చేసి ఈ టోర్నీలో తొలిసారి టైటిల్ నెగ్గాడు. 44 నిమిషాల్లోనే ముగిసిన పోరులో సతీశ్ ఆధ్యంతం దూకుడు ప్రదర్శించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
ఇక తనీషా-అశ్విని జోడీ.. 21-118, 21-12తో లి హువా-వాంగ్ జి (చైనా)ను ఓడించి వరుసగా రెండో టైటిల్‌ను గెలిచింది. మహిళల సింగిల్స్‌లో యువ సంచలనం అన్మోల్ ఖర్బ్ ఫైనల్లో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. టోర్నీ ఆసాంతం రాణించిన అన్మోల్.. ఫైనల్లో 21-14, 13-21, 19-21తో కై యన్ యన్ (చైనా) చేతిలో ఓడింది. 78 నిమిషాల పాటు హోరాహోరిగా సాగిన పోరులో అన్మోల్ పోరాడినా నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తడబాటుకు లోనై పరాభవం పొందింది.