దుబాయ్ : భారత టెస్టు సారథి శుభ్‌మన్ గిల్ మరో ఐసీసీ అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆసాంతం బ్యాట్‌తో రాణించిన టీమ్ఇండియా కెప్టెన్.. జూలై నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు.
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ మల్డర్ సైతం ఈ అవార్డుకు పోటీపడ్డా.. ఆ ఇద్దరినీ అధిగమించి గిల్‌కు ఈ గౌరవం దక్కింది.