టోక్యో: పారాలింపిక్స్‌లో ఇండియాకు మరో మెడల్స్ దక్కాయి. షూటర్ మనీశ్ నర్వాల్ ఇవాళ జరిగిన ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలిచాడు. పీ4 మిక్స్డ్ 50మీటర్ల పిస్తోల్ ఈవెంట్లో మనీశ్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. టాప్‌లో నిలిచిన అతను స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక ఇదే ఈవెంట్లో సింఘరాజ్‌కు సిల్వర్ మెడల్ దక్కడం విశేషం. దీంతో పారాలింపిక్స్‌లో ఇండియా పతకాల సంఖ్య 15కు చేరింది. మహిళల షూటింగ్ ఈవెంట్లో అవని రెండు మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే.
చరిత్ర సృష్టించిన నర్వాల్..
50మీ పిస్తోల్ ఎస్‌హెచ్1 ఫైనల్లో షూటర్ మనీశ్.. 218.2 పాయింట్లు స్కోర్ చేశాడు. దీంతో అతను పారాలింపిక్స్ చరిత్రలో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ స్కోర్ పారాలింపిక్స్‌లో రికార్డుగా నిలిచింది. అంతేకాదు.. వరల్డ్ రికార్డు కూడా మనీశ్ ఖాతాలోనే ఉన్నది. మరో షూటర్ అదాన సింగరాజ్ ఈ ఈవెంట్లో 216.7 పాయింట్లు స్కోర్ చేశారు. సింగరాజ్‌కు ఈ గేమ్స్‌లో ఇది రెండవ మెడల్ కావడం విశేషం.
India strikes GOLD ! 🥇
— Anurag Thakur (@ianuragthakur) September 4, 2021
Manish Narwal what a fabulous victory!
Congratulations on also holding the World Record in this category!
• Mixed 50m Pistol SH1 Final
• score of 218.2
• New Paralympics Record.#Cheer4India #Praise4Para pic.twitter.com/SEhVxXdA3m
షూటింగ్లో బంగారు పతకం గెలిచిన షూటర్ మనీశ్ నర్వాల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మనీశ్ సూపర్ విక్టరీ కొట్టారంటూ కేంద్ర క్రీడాశాక మంత్రి అనురాగ్ ఠాకూర్ తన ట్విట్టర్లో తెలిపారు. ఇదే క్యాటగిరీలో వరల్డ్ రికార్డును నెలకొల్పినందుకు షూటర్‌కు మంత్రి కంగ్రాట్స్ తెలిపారు.
It’s raining Medals for India 🇮🇳 #Tokyo2020 !
— Anurag Thakur (@ianuragthakur) September 4, 2021
15th medal for #IND !
‘Superb Singhraj’ has created history by winning the SILVER🥈!
• P4 Mixed 50m Pistol SH1 Final with 216.7 points
• 2nd medal at the games.#Cheer4India#Praise4Para #Paralympics pic.twitter.com/YZ1kLjSWcD