హైదరాబాద్, ఆట ప్రతినిధి: యోనెక్స్ సన్రైస్ ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో శశాంక్, దుర్గా ఇషా-కీర్తి మంచాల విజేతలుగా నిలిచారు. మియాపూర్‌లోని చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా సోమవారం ముగిసిన ఈ టోర్నీలో అండర్ 15 సింగిల్స్ పైనల్లో పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన శశాంక్.. 21-11, 22-20తో అదే అకాడమీకి చెందిన గిరవాసన్ పై గెలిచి టైటిల్ నెగ్గాడు. అండర్-17 మహిళల డబుల్స్‌లో దుర్గా ఇషా-కీర్తి మంచాల.. 21-16, 21-19తో దీప్క్ రాజ్ అదితి- పొన్నమ్మపై గెలిచారు. అండర్-15లో ప్రశాంత్ షిండే, సూర్యవంశీ రన్నరప్స్గా నిలిచారు. పైన పేర్కొన్న షట్లర్లంతా గోపిచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నవారే కావడం విశేషం. విజేతలను గోపిచంద్, సీనియర్ కోచ్ రాజేందర్, అనిల్, బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు అభినందించారు.