Shardul Thakur | భారత ఆల్‌రౌండర్ హల్దీ వేడుక.. ఫొటోలు వైరల్
ల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరో రెండు రోజుల్లో (ఫిబ్రవరి 27న) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు. శార్ధూల్ తన హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. శార్దూల్ వివాహం చేసుకునే అమ్మాయి పేరు మిథాలీ పారుకర్. ఈమె 2021 నవంబర్‌లో వీళ్లిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది.
Shardul Thakur : భారత జట్టులో మరోసారి పెళ్లి బాజా మోగనుంది. ఈమధ్యే ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, ఓపెనర్ కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడికి లార్డ్స్ శార్దూల్ వంతు. అవును.. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరో రెండు రోజుల్లో (ఫిబ్రవరి 27న) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు. దాంతో, ఇప్పటికే అతడి ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. శార్ధూల్ తన హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాదు అతను పసుపు రంగు కుర్తా వేసుకుని డాన్స్ చేస్తున్న వీడియో కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎవరీ మిథాలీ..?
శార్దూల్ వివాహం చేసుకునే అమ్మాయి పేరు మిథాలీ పారుకర్. ఈమె 2021 నవంబర్‌లో వీళ్లిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. మిథాలీ స్వగ్రామం మహారాష్ట్రలోని కొల్హాపూర్. మిథీబాయి కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆంత్రోప్రెన్యూర్ అయిన మిథాలీ ఆల్ ది జాజ్ లక్జరీ బేకర్స్ అనే కంపెనీ నడుపుతోంది. శార్ధూల్ ఠాకూర్ ఈ ఏడాది పెళ్లి చేసుకున్న మూడో భారత క్రికెటర్ అవుతాడు. ఇప్పటికే అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా రెండోసారి తన భార్య నటాషాను వివాహం చేసుకున్నాడు. ఫిబ్రవరి 14న ఉదయ్‌పూర్‌లో సంప్రదాయ ప్రకారం వీళ్ల పెళ్లి జరిగింది.
ఈసారి కేకేఆర్ టీమ్‌లో..
ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన శార్దూల్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. దాంతో, 2022 మినీ వేలంలో భారీ ధర పలికాడు. ఢిల్లీ జట్టు రూ. 10.75 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. అయితే.. ఆ సీజన్లో ఈ ఆల్‌రౌండర్ పేలవంగా ఆడాడు. దాంతో, 2023 సీజన్‌కు ముందు ట్రేండ్ ఒప్పందం ద్వారా అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంఛైజీ దక్కించుకుంది. గతంలో అతను ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లకు ఆడాడు.
ఇవి కూడా చదవండి
ICC | మహిళల టీ20 వరల్డ్ కప్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ షార్టు లిస్టులో రీచా ఘోష్
Sachin Tendulkar | అన్వర్ రికార్డు సచిన్ బద్ధలు కొట్టి 13 ఏళ్లు.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
Mumbai Indians | ముంబై ఇండియన్స్ డబ్ల్యూపీఎల్ జెర్సీ విడుదల.. వావ్ సూపర్ అంటున్న ఫ్యాన్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

