IPL 2024 | లండన్‌లో సర్జరీ.. ఐపీఎల్ నుంచి స్టార్ పేసర్ ఔట్
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభానికి ముందే అభిమనులకు పెద్ద షాక్. గుజరాత్ టైటాన్స్ జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ(Mohammad Shami) సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఎడమ కాలి మడిమ గాయం(Ankle Injury) తో బాధపడుతున్న షమీ..
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభానికి ముందే అభిమనులకు పెద్ద షాక్. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ(Mohammad Shami) సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఎడమ కాలి మడిమ గాయం(Ankle Injury) తో బాధపడుతున్న షమీ.. ఇంకా కోలుకోలేదు. అతడు వచ్చే నెలలో మొదలవ్వనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024)కు కూడా దూరం కానున్నాడు. ఈ స్పీడ్‌స్టర్ లండన్‌లో కాలి మడమకు సర్జరీ చేయించుకోనున్నాడని, అతడు 17వ సీజన్‌కు దూరమయ్యే చాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కాలిమడమకు ప్రత్యేకమైన ఇంజెక్షన్లు తీసుకునేందుకు జనవరిలో షమీ లండన్‌కు వెళ్లాడు. మూడు వారాల్లో కోలుకుంటానని, నెమ్మదిగా పరుగెత్తుతానని కూడా అతడు చెప్పాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ ఇంజెక్షన్లు పనిచేయలేదు. దాంతో, తప్పనిసరిగా సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే సర్జరీ కోసం షమీ లండన్ వెళ్లనున్నాడు. అందువల్ల అతడు ఐపీఎల్‌కు దూరం కానున్నాడు అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఐపీఎల్ 15 సీజన్ ట్రోఫీతో హార్దిక్ పాండ్యా

మార్చి 22 నుంచి ఐపీఎల్ ఆరంభం కానుంది. నిరుడు రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ ఈసారి కొత్త కెప్టెన్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనడంతో 17వ సీజన్లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అనుభవజ్ఞుడైన కెప్టెన్‌తో పాండ్యాతో పాటు షమీ దూరం కావడమనేది ఈసారి గుజరాత్‌కు పెద్ద లోటే.

నిరుడు స్వదేశీ గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షమీ అద్భుతంగా రాణించాడు. మొత్తంగా 24 వికెట్లు తీసి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టైటిల్ పోరులోనూ షమీ మూడు వికెట్లు తీసినా.. ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో ఆసీస్‌ను గెలిపించాడు.

అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు సిద్ధమవుతుండగా షమీ గాయపడ్డాడు. కాలి మడమ గాయం తగ్గకపోవడంతో ఇంగ్లండ్ సిరీస్‌కు సైతం అతడు దూరమయ్యాడు. నిరుడు అత్యుత్తమంగా రాణించిన షమీ ప్రతిష్ఠాత్మక అర్జున(Arjuna) అవార్డు అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించాడు.
ఇవి కూడా చదవండి
- YS Sharmila arrest | విజయవాడలో ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల అరెస్టు
- Student died | బాబాపూర్‌లోని మైనార్టీ పాఠశాల విద్యార్థిని మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

