WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మూడో రోజు.. రెండో సెషన్లో భారత జట్టు ఎట్టకేలకు వికెట్ సంపాదించింది. కొత్త బంతి అందుకున్న సీనియర్ పేసర్ షమీ కీలక వికెట్ అందించాడు. మిచెల్ స్టార్క్(41)ను ఔట్ చేసి ఏడో వికెట్ 93 పరుగులభాగస్వామ్యానికి తెరదించాడు. షమీ 140 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతి స్టార్క్ బ్యాట్‌కు తగిలింది.
స్లిప్‌లో కాచుకున్న కోహ్లీ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దాంతో, 260 వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. అలెక్స్ క్యారీ(66), ప్యాట్ కమిన్స్(5) క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్కోర్… 269/7. ఆ జట్టు ఆధిక్యం 442కు చేరింది.