చెన్నై: తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు స్కోరుతో దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను తమ అధీనంలోకి తీసుకున్న ఈస్ట్‌జోన్.. బంతితోనూ అదరగొడుతున్నది. ప్రత్యర్థి జట్టు బౌలర్లు రెండు రోజుల పాటు బౌలింగ్ చేసి అంతగా ప్రభావం చూపని పిచ్‌పై వెటరన్ పేసర్ మహ్మద్ షమీ (2/17), ముకేశ్ కుమార్ (2/36) చెలరేగడంతో మూడో రోజు, మంగళవారం ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 6 వికెట్లు కోల్పోయి 242 రన్స్ చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (104 బంతుల్లో 4 ఫోర్లతో 62)తో పాటు కెప్టెన్ తిలక్ వర్మ (133 బంతుల్లో 5 ఫోర్లతో 56 నాటౌట్) ఆదుకున్నా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.
జగదీశన్ (32)తో రెండో వికెట్‌కు 60 పరుగులు, షేక్ రషీద్ (27)తో మూడో వికెట్‌కు 56 రన్స్ జోడించిన పడిక్కల్‌ను ముకేశ్ ఔట్ చేశాడు. తిలక్, శ్రేయస్ గోపాల్ (26) సుమారు 27 ఓవర్ల పాటు వికెట్‌ను కాపాడుకున్నా ఆట కాసేపట్లో ముగుస్తుందనగా ఖురేషి బౌలింగ్‌లో శ్రేయస్.. రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో సౌత్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. తిలక్ సేన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంకా 466 పరుగుల భారీ లోటుతో ఉంది. ఈ మ్యాచ్‌ను కాపాడుకోవడం సౌత్‌కు శక్తికి మించిన పనే