ఢిల్లీ: భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ మరోసారి కోర్టు మెట్లెక్కింది. భరణం కింద షమీ నెలనెలా చెల్లిస్తున్న రూ. 4 లక్షలు సరిపోవడం లేదని.. వాటిని రూ. 10 లక్షలకు పెంచాలని కోరుతూ ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2018లో షమీ కుటుంబం తనను గృహహింసకు గురిచేస్తుందని పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘ విచారణ తర్వాత 2023లో ట్రయల్ కోర్టు.. భరణం కింద ఆమెకు నెలకు రూ. 50 వేలు, కుమార్తె సంరక్షణ నిమిత్తం రూ. 80 వేలు చెల్లించాలని ఆదేశించింది.
అయితే దీనిపై ఆమె కోల్కతా హైకోర్టును ఆశ్రయించగా ఆ మొత్తాన్ని రూ. 4 లక్షల(ఆమెకు రూ. 1.5 లక్షలు, కూతురుకు రూ. 2.50 లక్షలు)కు పెంచింది. తాజాగా ఆ మొత్తాన్ని రూ. 10 లక్షలకు పెంచాలని హసీన్ కోర్టుకు వెళ్లింది. దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని షమీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.