IPL 2025 : స్వల్ప స్కోర్ కొట్టిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్‌లో అదరగొడుతోంది. ఛేదనలో గుజరాత్ టైటన్స్(Gujarat Titans) బ్యాటర్లను పేసర్లు బెంబేలిత్తించారు. ఓపెనర్ సాయి సుదర్శన్(5)ను ఔట్ చేసిన షమీ తొలి వికెట్ అందించాడు. ఆ కాసేపటికే జోస్ బట్లర్(0) ను కమిన్స్ డకౌట్‌గా వెనక్కి పంపాడు. అయితే.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన వాషింగ్టన్ సుందర్(23) ధాటిగా ఆడుతున్నాడు.
సిమర్జిత్ సింగ్ వేసిన 6వ ఓవర్లో సుందర్ విధ్వంసం సృష్టించాడు. తొలి రెండు బంతులకు ఫోర్లు బాదిన అతడు.. నాలుగో, ఆరో బంతిని ఫైన్ లెగ్‌లో సిక్సర్‌గా మలిచాడు. దాంతో, గుజరాత్ నెట్రన్ రేటు ఏడుకు చేరింది. పవర్ ప్లేలో గుజరాత్ స్కోర్.. 48-2.
𝙋𝙖𝙩 your back #SRH fans for a 𝙎𝙝𝙖𝙢𝙖𝙯𝙞𝙣𝙜 start 🧡#GT are 17/2 after 4 overs.
Updates ▶ https://t.co/Y5Jzfr6Vv4#TATAIPL | #SRHvGT | @SunRisers pic.twitter.com/jmNSc7zEBL
— IndianPremierLeague (@IPL) April 6, 2025
సొంతమైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మళ్లీ నిరాశపరిచారు. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ నిలకడ లేమిని కొనసాగించింది టాపార్డర్. ఇన్నింగ్స్ ఆరంభంలోనే గుజరాత్ టైటన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆరెంజ్ ఆర్మీకి పెద్ద షాకిచ్చాడు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(8), అభిషేక్ శర్మ(18)లను పెవిలియన్ పంపాడు. 50 పరుగులకే 3 వికెట్లు పడిన దశలో నితీశ్ కుమార్ రెడ్డి(31), హెన్రిచ్ క్లాసెన్(27)లు 50 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో అనికేత్ వర్మ(18), కెప్టెన్ ప్యాట్ కమిన్స్(22 నాటౌట్) మెరుపులతో జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు. నిర్ణీత ఓవర్లలో ఆరెంజ్ ఆర్మీ రెండు కీలక వికెట్లు కోల్పోయి పరుగులు చేయగలిగింది.