ఢాకా: స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను ఆసియాకప్, టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్‌గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు శనివారం నిర్ణయం తీసుకుంది. యూఏఈ వేదికగా ఈ నెల 27 నుంచి ఆసియాకప్.. అక్టోబరు-సెప్టెంబరులో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపపంచకప్ జరుగనున్న సంగతి తెలిసిందే. బోర్డు, షకీబ్‌ల మధ్య వివాదం ముగియడంతో అతడిని సారధిగా నియమిస్తూ బంగ్లా క్రికెట్ బోర్డు నిర్ణయించింది. జూన్ నుంచి షకీబ్ టెస్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.