డర్బన్: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది(Shaheen Afridi).. అరుదైన రికార్డును సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో వంద వికెట్లు తీసుకున్న తొలి పాకిస్థాన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. టీ20ల్లోనూ వంద వికెట్లు తీసుకున్న బౌలర్‌గా షాహిన్ అఫ్రిది రికార్డు క్రియేట్ చేశాడు. డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వంద వికెట్ల మైలురాయి దాటేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసుకున్నాడతను.
టీ20లతో పాటు వన్డేలు, టెస్టుల్లో కూడా షాహిన్ అఫ్రిది వందేసి వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటి వరకు వన్డేల్లో 112, టెస్టుల్లో 116 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు అఫ్రిది. టీ20ల్లో వంద వికెట్లు తీసుసుకున్న మూడవ పాకిస్థాన్ బౌలర్ అయ్యాడు. అంతకముందు హరిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ ఆ మైలురాయి అందుకున్నారు.
74 టీ20 మ్యాచుల్లో షాహిన్ వంద వికెట్లు తీసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో వందేసి వికెట్లు తీసిన బౌలర్లలో న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ, బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్, శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ ఉన్నారు.
🚨 1️⃣0️⃣0️⃣ T20I wickets for @iShaheenAfridi 🚨
He becomes only the 4️⃣th bowler to take 💯 wickets in all three formats of the game 🤩#SAvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/ssF7WGrruD
— Pakistan Cricket (@TheRealPCB) December 10, 2024