Shafali Verma : భారత మహిళల జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ (Shafali Verma) ఇంగ్లండ్ పర్యటతో పునరాగమనం చేస్తోంది. ఏడాది క్రితం ఫామ్ లేమితో జట్టులో చోటు కోల్పోయిన షఫాలీ.. దేశవాళీలో, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో సత్తా చాటి మళ్లీ సెలెక్టర్ల దృష్టిలో పడింది. శనివారంతో ప్రారంభం కానున్న ఐదు టీ20ల సిరీస్ షఫాలీకి నిజంగా పరీక్షే. దాంతో.. ప్రశాంతంగా ఉంటూ తనదైన శైలిలో చెలరేగాలనే పట్టుదలతో ఉందీ ఓపెనర్. టీమ్‌కు దూరమైనప్పుడు ఎంతో బాధపడ్డానని, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) బ్యాటింగ్ వీడియోలు చూసి స్ఫూర్తి పొందనని చెబుతోంది డాషింగ్ ఓపెనర్. ఏ
‘మొదట్లో నేను ప్రతి బంతికి ఫోర్, సిక్స్ కొట్టాలని అనుకునేదాన్ని. కానీ, అది చాలా తప్పని తెలుసుకున్నా. మంచి బంతులను వదిలేయాలని గ్రహించాను. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ వీడియోలు చూసి చాలా స్ఫూర్తి పొందాను. మాస్టర్ బ్లాస్టర్ బ్యాటింగ్ చూస్తుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. క్రికెట్ మ్యాచ్ ఉంటే నేను సచిన్ ఔటయ్యేంతవరకూ టీవీ ముందు నుంచి కదలకపోయేదాన్ని. సచిన్ ఆడిన ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా చూశాను. ఈ క్రమంలోనే మంచి బంతుల్ని గౌరవించాలనే విషయం నాకు బోధపడింది’ అని బీసీసీఐ వీడియోలో షఫాలీ వెల్లడించింది.
— Shafali Verma (@TheShafaliVerma) June 27, 2025
విధ్వసంక ఇన్నింగ్స్‌లతో అలరించే షఫాలీ వర్మ వన్డే, టీ20ల్లో టీమిండియా ఓపెనర్‌గా స్థిరపడిపోయింది. స్మృతి మందానతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తూ.. తన మార్క్ షాట్లతో విరుచుకుపడుతూ జట్టుకు శుభారంభాలు ఇచ్చింది. అయితే.. నిరుడు పేలవ ఫామ్‌తో నిరాశపరిచింది. దాంతో, నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌కు ముందే తనపై వేటు పడింది. టీమ్ నుంచి దూరమయ్యాక షఫాలీ తన పొరపాట్లను సరిదిద్దుకోవడం దృష్టి సారించింది.
Setbacks. Strength. Shafali 💪
⏳ Living in the present
🌟 Taking inspiration from the legendary @sachin_rt
🏡 Rebuilding with strength of familyHere’s Shafali Verma’s comeback story – by @jigsactin
Full interview 🎥🔽 #TeamIndia | #ENGvIND https://t.co/JWiDOaXPc2 pic.twitter.com/eSBkb35xQv
— BCCI Women (@BCCIWomen) June 28, 2025
అదే సమయంలో వాళ్ల నాన్నకు గుండెపోటుకు రావడంతో షఫాలీ మానసికంగా వేదనకు గురైంది. తండ్రి కోలుకున్నాక ఆటపై, ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టింది షఫాలీ. ఆ తర్వాత జరిగిన దేశవాళీలో, మహిళల ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో పరుగుల వరద పారించింది. నిరుడు టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన షఫాలీ.. ఇంగ్లండ్ పర్యటనలో రాణించి ఓపెనర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తోంది.