WI vs PNG : టీ20 వరల్డ్ కప్లోరెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్. అయినా సరే పపువా న్యూ గినియా(PNG) బ్యాటర్లు అదరలేదు. కనీసం వంద కొట్టినా గొప్పే అనుకున్న విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. మిడిలార్డర్ బ్యాటర్ సెసె బౌ(50) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అనంతరం వికెట్ కీపర్ కిప్లిన్ డొరిగ(27 నాటౌట్) దూకుడుగా ఆడి జట్టు స్కోర్ 130 దాటించాడు. ఓపెనర్ల నుంచి టెయింలెండర్ల వరకూ హిట్టర్లతో నిండిన విండీస్ భారీ తేడాతో గెలుస్తుందా? లేదా? చూడాలి.
గయానా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్లు పవర్ ప్లేలో కీలక వికెట్లు తీశారు. ఓపెనర్ టోనీ ఉరా(2)ను షెపర్డ్ ఔట్ చేసి తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అస్సాద్ వలా(21) ధనాధన్ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే.. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో రోస్టన్ ఛేజ్ చేతికి దొరికాడు. ఆ తర్వాత స్పిన్నర్లు హొసెన్, మోతీలు తలొక వికెట్ తీసి పపువాను మరింత కష్టాల్లోకి నెట్టారు.
A brilliant fifty 🔥
Sese Bau starts the #T20WorldCup with a @MyIndusIndBank Milestone.#WIvPNG pic.twitter.com/gNc9O9K7W8
— ICC (@ICC) June 2, 2024
యాభై పరుగులకే నాలుగు కీలక వికెట్లు పడిన దశలో సెస్ బౌ(22), చార్లెస్ అమిని(3)లు విండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఐదో వికెట్‌కు వీళ్లు 44 రన్స్ జోడించి తాము దంచగలమని నిరూపించారు. అయితే.. జోసెఫ్ సూపర్ బంతితో సెసెను బౌల్డ్ చేసి పీఎన్జీ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. కానీ వికెట్ కీపర్ కిప్లిన్ డొరిగ(27 నాటౌట్), చాడ్ సోపర్(10)లు ఆఖరి ఓవర్లలో చకచకా డబుల్స్ తీసి జట్టు స్కోర్ 130 దాటించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు.