మెల్బోర్న్: మాజీ ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమైంది. తన వైద్యుల సలహా మేరకు సెరెనా ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 17 నుంచి జరుగనున్న ఈ టోర్నీ ఎంట్రీ జాబితాలో సెరెనా పేరును చేర్చలేదు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన వింబుల్డన్ తొలి రౌండ్లో గాయపడిన సెరెనా అప్పటి నుంచి మళ్లీ కోర్టులో అడుగుపెట్టలేదు. ఏడు సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ నెగ్గిన ఆమె అదే గాయం కారణంగా 2022 టోర్నీకి దూరమవుతున్నది. ఇప్పటివరకు సెరెనా 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు సాధించింది. ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఈ ఓపెన్‌లో పాల్గొననున్నాడు. బుధవారం విడుదల చేసిన ఎంట్రీ లిస్ట్‌లో జొకోవిచ్ పేరు ఉండడం గమనార్హం.